Skip to main content

Telugu News Power

అనుమతులు లేని మంత్రి గారి బడి మూత.

మూసివేసిన పాఠశాలలో సామాగ్రి

భీమవరం: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
నారాయణ స్కూల్‌ను విద్యాశాఖ అధికారులు సోమవారం మూసివేయించారు.
ఎటువంటి అనుమతులు, లేకుండానే తరగతులు నిర్వహిస్తుండటంతో అధికారుల చర్యలు చేపట్టారు.స్కూల్ భవన నిర్మాణం పూర్తికాకుండానే క్లాసులు నడపడంపై ఎస్ఎఫ్ఐ నాయకుల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.నియమ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ ప్రాంగణంలోనే పుస్తకాలు, విద్యాసామాగ్రి విక్రయాలు జరపటం పట్ల వారు అభ్యంతరం తెలిపారు.
మంత్రి నారాయణ పదవి వదిలి స్కూళ్లలో పుస్తకాలు, బ్యాగులు అమ్ముకోవాలంటూ ఎస్ఎఫ్ఐ మండిపడ్డారు.ఎటువంటి పర్మిషన్లు లేకుండా పాఠశాల నడుపుతున్న మాట నిజమేనని విద్యాశాఖ అధికారులు అంగీకరించారు.