Telugu News Power

బడుగు బ్రాహ్మణ కుటుంబానికి ఆర్థిక సాయం.

దాతల నుంచి సహాయం అందుకుంటున్న నిమ్మగడ్డ ప్రసాద్

పాలకొల్లు: జూన్, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం మరోసారి తన ఔదార్యం చాటుకున్నది. బడుగు బ్రాహ్మణ కుటుంబానికి, తమ సంఘ సభ్యుల సౌజన్యంతో 30 వేల రూపాయల ఆర్థిక సహాయంతో ఆదుకునే ప్రయత్నం చేసింది. స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో పురోహితునిగా సేవలందిస్తున్న నిమ్మగడ్డ ప్రసాద్ కు ఈ సాయం అందించారు. వీరి కుమారుడు సాయి శ్రీరామ్ గత కొంతకాలంగా అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆర్యవైశ్య సంఘం వారిని సంప్రదించగా, వారు పెద్ద మనసుతో ముందుకు వచ్చి సాయం చేశారు. సంఘ అధ్యక్షులు, అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రేపాక ప్రవీణ్ భాను, ప్రధాన కార్యదర్శి, సనిశెట్టి లీలా భావన్నారాయన, కోశాధికారి,బలభద్ర బాలిరెడ్డియ్య సంఘ కార్యాలయంలో ఈ సహాయాన్ని అందజేశారు.