మంగళగిరి: జూన్, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ 25 పార్లమెంటు నియోజకవర్గాలకు పరిశీలకులను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
జనసేన పార్టీ నిర్మాణ ప్రక్రియలో భాగంగా పార్టీ ఉన్నతి కోసం తొలి నుంచి తపించిన జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళల నుంచి పార్టీ పదవుల కోసం దరఖాస్తులను తీసుకోవడానికి ‘సమాచార సేకరణ కమిటీ’లను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. ప్రతి పార్లమెంటు నియోజక వర్గానికి ఒక పరిశీలకుడిని నియమిస్తామని గతంలోనే ప్రకటించారు. ఇందులో భాగంగా 25 పార్లమెంటు నియోజక వర్గాలకు సమాచార సేకరణ కమిటీ పరిశీలకులను సోమవారం నిర్ణయించారు. వీరు ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. వారు పార్టీలో ఏ స్థాయిలో, ఏ బాధ్యతలు తీసుకోవాలని ఆసక్తి చూపుతున్నారో వివరాలు సేకరిస్తారు. వీరికి సహాయకులుగా ముగ్గురు సీనియర్ నాయకులు, ముగ్గురు సాధకులు, 21 మంది సమన్వయకర్తలు ఉంటారు. సేకరించిన దరఖాస్తులను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపుతారు. వాటిని అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా పరిశీలించిన తరవాత తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ సేకరణ కమిటీలు – కేవలం పార్లమెంట్ నియోజకవర్గం స్థాయిలో పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో సమావేశం ఏర్పాటు చేసి, దరఖాస్తులను తీసుకోవడానికి పరిమితం అవుతాయి. ఈ కమిటీలు ఈ నెల 29వ తేదీ నుంచి తమ ప్రక్రియను ప్రారంభిస్తాయి.
సమాచార సేకరణ కమిటీ పరిశీలకులు – పార్లమెంటు నియోజకవర్గం వివరాలు:
1 సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ – శ్రీకాకుళం
2 కొరికాన రవికుమార్ – విజయనగరం
3 కొణతాల రామకృష్ణ – విశాఖపట్నం
4 కొణిదల నాగబాబు – అరకు
5 పెండెం దొరబాబు – అనకాపల్లి
6 పంచకర్ల రమేష్ బాబు – అమలాపురం
7 సామినేని ఉదయభాను – కాకినాడ
8 కొటికలపూడి గోవిందరావు – రాజమహేంద్రవరం
9 బత్తుల బలరామకృష్ణ – ఏలూరు
10 పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) – నరసాపురం
11 కందుల దుర్గేష్ – విజయవాడ
12 పిడుగు హరిప్రసాద్ – మచిలీపట్నం
13 బొలిశెట్టి శ్రీనివాస్ – గుంటూరు
14 బాలినేని శ్రీనివాసరెడ్డి – నర్సరావుపేట
15 దేవ వరప్రసాద్ – బాపట్ల
16 కిలారు వెంకట రోశయ్య – ఒంగోలు
17 బొమ్మిడి నాయకర్ – నెల్లూరు
18 లోకం నాగ మాధవి – తిరుపతి
19 పత్సమట్ల ధర్మరాజు – చిత్తూరు
20 కళ్యాణం శివ శ్రీనివాస్ – రాజంపేట
21 చిలకం మధుసూదన్ రెడ్డి – కడప
22 టి.ఉదయ్ శ్రీనివాస్ – కర్నూలు
23 వల్లభనేని బాలశౌరి – నంద్యాల
24 చిల్లపల్లి శ్రీనివాసరావు – హిందూపురం
25 వేములపాటి అజయ కుమార్ – అనంతపురం.