Telugu News Power

అమోనియ లీకేజీ పట్ల తుందుర్రు గ్రామస్తుల ఆందోళన.

ఫుడ్ పార్క్ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆరేటి వాసు

వీరవాసరం : జూన్, 23{ తెలుగు న్యూస్ పవర్. కామ్ ) ఇటీవల తమిళనాడులో రొయ్యల ఫ్యాక్టరీలో జరిగిన అమోనియా లీకేజీ సంఘటన పట్ల తుందురువాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న రియల్ ఫ్యాక్టరీలో సంభవించిన అమూల్య లీకేజీ ప్రమాదం వల్ల 8 మంది మృతి చెందగా, 80 మంది ఆసుపత్రి పాలైనట్టు గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామాల మధ్యలో ఏర్పాటు చేసిన గోదావరి మెగా ఫుడ్ పార్క్ వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తే పరిస్థితి ఏమిటని గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుర్వాసన వల్ల ఇప్పటికే మూడు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. కోర్టు ఆదేశాలను కూడా తుంగలో తొక్కి కనీస భద్రత ప్రమాణాలు పాటించడం లేదని వారు వాపోయారు. ఫుట్బాల్ వారికి డబ్బు సంపాదన పట్ల ఉన్న ఆసక్తి, స్థానిక ప్రజల ప్రాణాలు కాపాడటం పై లేదని ఆరోపించారు. ఫుట్ పార్కులో ఏ ప్రమాదం జరిగినా ప్రాణ నష్టం భారీగా ఉంటుందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఒకే ఒక్క కుటుంబం, ఆనంద్ గ్రూపు వారి కోసం వేలాదిమంది ప్రజల ప్రాణాలు ఫలంగా పెట్టవద్దని ప్రజలు ప్రభుత్వాన్ని
వేడుకుంటున్నారు. మరోసారి ఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమం విజృంభించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జనసేన పార్టీ నాయకులు, ఫుడ్ పార్క్ పోరాట కమిటీ కన్వీనర్ ఆరేటి వాసు ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లినట్టు తెలిపారు.

పచ్చని పశ్చిమగోదావరి జిల్లా, ప్రశాంత వాతావరణాన్ని కేవలం ఒకే ఒక్క #ఆనంద_గ్రూప్_వారు వారి ఫ్యామిలీ సంపాదన కోసం జిల్లా మొత్తాన్ని కాలుష్య మాయం చేసి నాశనం చేసేస్తున్నారు….

అయ్యా Nara Chandrababu Naidu గారు, డిప్యూటీ సీఎం Pawan Kalyan గారు…
మా గ్రామాల మధ్యలో మా ఇళ్ళకి చేర్చి నిర్మించిన #గోదావరి_మెగా_ఆక్వా_ఫుడ్_పార్క్ లో భారీ ఎత్తున అమ్మోనియా వాడతారు(నిన్న చిన్న ఆక్వా ఫ్యాక్టరీ లో అమ్మోనియా లీక్ అయ్యి 8 మంది చనిపోయారు, 80 మంది ఆస్పత్రి పాలు అయ్యారు). ఏదయినా అనుకోని ప్రమాదం జరిగి అమ్మోనియా లీక్ అయితే జరిగే ప్రాణ నష్టం ఊహతీతం…..

ఈ ఫుడ్ పార్క్ యాజమాన్యం వారికి డబ్బు మీద తప్ప, ఫ్యాక్టరీలో భద్రత ప్రమాణాల మీద పెద్దగా పట్టించుకోరు…

ఇప్పటికే ఈ ఫ్యాక్టరీ నుండి వచ్చే దుర్వాసన మా 3 గ్రామాల్లో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం….

కోర్ట్ చెప్పిన కూడా భద్రత ప్రమాణాలు పాటించడం లేదు…

మా గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం మళ్ళీ ఉద్యమం చేసే అవసరం రాకుండా తగు చర్యలు తీసుకొంటారని ఆశిస్తున్నాం….

ఇట్లు
ఆరేటి వాసు
ఫుడ్ పార్క్ పోరాట కమిటీ కన్వీనర్…
తుందుర్రు గ్రామ ఎంపీటీసీ….
జనసేన పార్టీ…