Skip to main content

Telugu News Power

ఘనంగా గజమాలయాత్ర బండి ముత్యాలమ్మ ఆలయం నుంచి అప్పనపల్లి బాలాజీ సన్నిధికి.

గజమాలయాత్ర కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ చాగంటి మురళి

మొగల్తూరు: జూన్,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, అప్పనపల్లి లో వేంచేసియున్న శ్రీ బాలాజీ స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా గురువారం మహా గజమాల యాత్ర భారీ భారీగా సాగింది. స్థానిక ముత్యాలపల్లి గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ బండి ముత్యాలమ్మ ఆలయం వద్ద నుంచి గురువారం ఉదయం ఈ యాత్ర ప్రారంభం అయింది. నరసాపురం నియోజకవర్గం శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ యాత్ర కొనసాగింది. మొల్లేటి వీరాస్వామి ఆదిలక్ష్మి పుణ్య దంపతులచే 1967లో శ్రీ బాలాజీ ఆలయం అప్పనపల్లిలో నిర్మించారు. అప్పటినుంచి నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వీరి విగ్రహాలకు గజమాలతో అలంకరణ చేశారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళి,వివిధ గ్రామల నుంచి తరలివచ్చిన భక్తులు ఈ యాత్రలో విశేషంగా పాల్గొన్నారు.

యజమాలయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు