న్యూఢిల్లీ: జూన్, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులుగా ఎగువసభలో శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరి చేత రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయించారు.
సానా సతీష్ బాబు, విజయ్ చింతాకాయల, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్( జనసేన) రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేసిన సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మాత్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు అభినందనలు తెలిపారు.
ఈ పారిశ్రామిక, సామాజిక సేవానైతికతతో భారతీయ ప్రజాస్వామ్యంలో స్ఫూర్తిదాయకమైన పాత్రను వారు నిర్వహించబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,డిప్యూటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనాత్మక మార్గనిర్దేశకత్వంలో, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ డి ఏ బృందంగా మా ప్రతినిధులు రాష్ట్రాభివృద్ధి కోసం సమర్థంగా పనిచేస్తారని నమ్మకం ఉందన్నారు. వారు రాష్ట్ర సంక్షేమం, పౌర సౌకర్యాల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి,వ్యవసాయ, పారిశ్రామిక విభాగాల్లో ప్రగతికే కీలక పాత్ర పోషిస్తారని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ పురోగతికి, ప్రజల సంక్షేమానికి, అభివృద్ధి పథంలో “వికసిత్ భారత్” నిర్మాణం కోసం ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యతతో, అంకితభావంతో పనిచేస్తుందని ఆకాంక్షించారు.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో కొత్త ఎంపీలు భేటీ.
కేంద్రమంత్రిని కలిసిన ఎంపి లింగమనేని