
పాలకొల్లు: జూన్,28( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచాన్ని అలరించిన కళాకారుల పుట్టిల్లు పాలకులని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందిన తొలి బ్యాచ్ విద్యార్థులకు స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్ లో పట్టా ప్రాధాన్ ఉత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఫిలిం ఇన్స్టిట్యూట్ గౌరవ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చిత్ర పరిశ్రమలో రెండే రెండు పట్టణాలకు అత్యంత ప్రాముఖ్యత ఉందని ఒకటి తినాలి రెండవది పాలకులను మంత్రి వెల్లడించారు. ప్రపంచ గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత దాసరి నారాయణరావు, అల్లు రామలింగయ్య నుంచి నేటి అనంత శ్రీరామ్ వరకు ఎందరో గొప్ప కళాకారులు క్షీరపురి నుంచి చిత్ర పరిశ్రమకు తమ సృజనాత్మకత సేవలు అందిస్తున్నారని తెలిపారు. మనందరం కళాకారులను వెలుగులోకి తీసుకురావడానికి ఇక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్థాపించటం ముదావహం అన్నారు. సోది ఖ్యాతి నటసార్వభౌముడు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు తాను కూడా కళాకారులు, కళల పట్ల అభిమానంతో ఉంటానన్నారు. కూటమి ప్రభుత్వంతో పాటు, తాను కూడా చిత్ర పరిశ్రమ పాలకొల్లులో విస్తరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి, ఎంపీ చేగొండి హరి రామ జోగయ్య మాట్లాడుతూ చిత్ర పరిశ్రమ పాలకొల్లులో అభివృద్ధి చెందటానికి స్థానిక ప్రముఖులు కృషి చేయాలని కోరారు. గౌరవ అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విజయవంతంగా నడుస్తుందని, ఎందుకు మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రిన్సిపల్ రాజమన్నం రెడ్డి తదితరులు కృషి ఎంతో ఉందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మొదటి బ్యాచ్ 15 మందికి మంత్రి పట్టాలు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ట్రాక్ సింగింగ్ కార్యక్రమం నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షులు ముత్యాల శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ రాజా వనం రెడ్డి, డాక్టర్ వర్మ, శ్రీనివాసరాజు, నిర్మాత తుమ్మలపల్లి రామా సత్యనారాయణ, దర్శకులు కురసాల కళ్యాణ కృష్ణ, సీనియర్ నటి దివ్యవాణి, కేసిరాజు రాంప్రసాద్, ఎస్బిఐ సుధీర్, గుడాల హరిబాబు, బందెల భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచాన్ని అలరించిన కళాకారుల పుట్టిల్లు పాలకొల్లు. -ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పట్టా ప్రధానోత్సవం లో మంత్రి నిమ్మల ఉవాచ. చిత్ర పరిశ్రమ ప్రగతికి హామీ.