Telugu News Power

నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, భక్తులకు శుభవార్త!

మన నర్సాపురం నియోజకవర్గ ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఇప్పటివరకు ప్రత్యేక (స్పెషల్) రైలుగా నడిచిన నర్సాపురం – అరుణాచలం ఎక్స్‌ప్రెస్ ఇకపై పూర్తిస్థాయి రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా మీ సేవల్లోకి రానుంది! ఈ మేరకు రైల్వే శాఖ నుండి పూర్తి అనుమతులు మంజూరయ్యాయి.
పరమ పవిత్రమైన అరుణాచల క్షేత్రానికి (తిరువణ్ణామలై) వెళ్లే మన ప్రాంత భక్తుల సౌకర్యార్థం, ఈ రైలు యొక్క తొలి రెగ్యులర్ సర్వీస్ ఘన ప్రారంభోత్సవాన్ని రేపు మధ్యాహ్నం మీ అందరి సమక్షంలో ప్రారంభిస్తున్నాము.

🔸రైలు ప్రారంభోత్సవ వివరాలు:
తేదీ: 01-07-2026 (బుధవారం)
సమయం: మధ్యాహ్నం 1:30 గంటలకు
వేదిక: భీమవరం టౌన్ రైల్వే స్టేషన్.

రైలు వివరాలు & ప్రయాణించే మార్గం:
ప్రయాణ మార్గం: పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, గుడివాడ, విజయవాడ మీదుగా ఈ రైలు నడుస్తుంది.

మన నియోజకవర్గ ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి మరియు ఆధ్యాత్మిక యాత్రలను సులభతరం చేయడానికి మన ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. భక్తులు మరియు ప్రయాణికులు ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను.