Skip to main content

Telugu News Power

కూటమి విజయోత్సవ సభలో పాల్గొన్న కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ.

మొగల్తూరు: జులై,1( తెలుగు న్యూస్ పవర్. కామ్)
నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు గ్రామంలో బుధవారం జరిగిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందన్నారు . ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎమ్.ఏ. షరీఫ్, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రామరాజు తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని వక్తలు హామీ ఇచ్చారు .