పాలకొల్లు: జూలై,2( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కోకోనట్ మర్చంట్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్
బి అప్పారావు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిగా (డిఐఈఓ) పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా చాంబర్స్ కళాశాల యాజమాన్యం ఆయనను గురువారం ఘనంగా సత్కరించారు. చైర్మన్ కెవిఆర్ నరసింహారావు , కార్యదర్శి కేవీ సీతారామరాజు, చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కటారి నాగేంద్ర కుమార్, చాంబర్స్ కళాశాలల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వెంకటేశ్వరరావు ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు. కళాశాలలకు, అధ్యాపకులకు, విద్యార్థిని, విద్యార్థులకు మరిన్ని సేవలు అందించాలని కోరారు. పశ్చిమగోదావరి జిల్లా జూనియర్ కళాశాలలను రాష్ట్రంలో ముందు వరుసలో నిలపాలని కె.వి.ఆర్ నరసింహారావు ఆశీస్సులు అందజేశారు. ఇంటర్ విద్య ఉపాధి కోర్సులను మరింత అభివృద్ధి చేసి, తీర ప్రాంత విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలని కోరారు.
జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిగా బి అప్పారావు.
పదోన్నతి పొందిన అప్పారావును అభినందిస్తున్న చాంబర్స్ కళాశాల ప్రముఖులు