పాలకొల్లు: జులై,4( తెలుగు న్యూస్ పవర్. కామ్) బడుగు బలహీన వర్గాల ఉద్ధరణ కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడు వంగవీటి మోహన రంగారావు అని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు కొనియాడారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే, కాపుల ఆరాధ్య దైవం, ఊరు ఊరులో విగ్రహాలు గల మహా నాయకుడు వంగవీటి మోహన రంగారావు 79 వ జయంతి సందర్భంగా స్థానిక మారుతి థియేటర్ సెంటర్ వద్ద గల రంగా నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నివాళులు అర్పించారు. రంగా అంటే ఒక వ్యక్తి కాదని, ఆయన మహా శక్తిని నిమ్మల పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు సేవలందించడంలో రాబోయే తరాలకు కూడా రంగా ఆదర్శంగా నిలుస్తారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్ రావు, మేక శేషుబాబు, కర్నెని గౌర్నాయుడు, గండేటి వెంకటేశ్వరరావు, మండెల రజిని, వంగా నరసింహారావు, పెనుమాక రామ్మోహన్రావు, జక్కంపూడి కుమార్, పినిశెట్టి చిన్ని, చవాకుల సూర్య నరేష్, పలువురు నాయకులు, కాపు యువత ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు.
బడుగులకు అండ రంగా. -మంత్రి నిమ్మల
రంగాకు వాళులర్పిస్తున్న మంత్రి నిమ్మల