Telugu News Power

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ. లబ్ధిదారులు145, రూ.1.17 కోట్ల సహాయం.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: జూలై,5( తెలుగు న్యూస్ పవర్. కామ్) పేద మధ్యతరగతి ప్రజల అనారోగ్య పరిస్థితులు పట్ల మానవత్వం లేకుండా ముఖ్యమంత్రి సహాయనిధి అందకుండా చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. తన క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి 450 మంది లబ్ధిదారులకు రూ. 1.17 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ఒక్కరోజులోనే పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ప్రజలు స్థానిక నాయకులతో కలిసి పంపిణీ కార్యక్రమం చేశారు. లబ్ధిదారులతో మంత్రి మాట్లాడి తెలుసుకున్నారు. వారికి తన వంతు సహాయం చేస్తా నని ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మూలన పెట్టిన పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలులోకి తెచ్చి, ఒక్క పాలకొల్లు నియోజకవర్గంలోనే రెండేళ్లలో రూ.15.36 కోట్లు వెచ్చించి అనారోగ్య పరిస్థితుల నుంచి కాపాడిన మానవత్వం ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఉన్నమట్ల కపర్ది, గండేటి వెంకటేశ్వరరావు, మామిడి శెట్టి పెద్దిరాజు, పొట్నూరి శ్రీనివాస్, జక్కంపూడి కుమార్, చిలుకూరి శ్రీనివాస్, బిట్ట లక్ష్మీనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.