Telugu News Power

నేలకొరిగిన దేవతా వృక్షం. ఆలమూరు కలవ పువ్వు వేపచెట్టు. తనువు చాలించిన శతాధిక తరువు.

వేపచెట్టు నుంచి విడువడిన కలవపువ్వు భాగం

పెనుమంట్ర: జూలై, 5( తెలుగు న్యూస్ పవర్. కామ్) దాదాపు 60 ఏళ్ల క్రితం అద్భుతం జరిగింది. వేలాదిమంది ఈ వింత చూడటానికి ఆరోజు ఎగబడ్డారు. మార్టేరు సమీపానగల ఆలమూరు గ్రామంలో ఈ సంఘటన నాడు చోటుచేసుకుంది. నేటి శివాలయం ఎదురుగా ఉన్న వేప చెట్టుకు కలువ పువ్వు మాదిరిగా వేప చెట్టు కాండం పైన కొంత భాగం విస్తరించింది. గ్రామస్తులు లక్ష్మీదేవి తమ గ్రామానికి వచ్చిందని, అందుకే వేప చెట్టుపై అధిష్టించినట్టు భావించి పూజలు చేయడం ప్రారంభించారు. పొలాలమ్మ దేవతగా ఆ మహా వృక్షం శనివారం వరకు పూజలు అందుకుంది. ఆ రాత్రి వేచిన పెనుగాలికి ఆ దేవతా వృక్షం సరిగ్గా కలువ పువ్వు విరిసిన చోట రెండుగా విడిపోయి నేలక వరిగి పోయింది. పల్లాలమ్మ దేవతగా ఐదేళ్లకోసారి భారీ జాతర కార్యక్రమం జరిగేది. భక్తుల నమ్మకానికి ఇంతకాలం ప్రతీకగా నిలచింది. మహాదేవుని ఆలయానికి ముందు మలుపులో అందరినీ ఆకర్షించిన వింత కనుమరుగైపోయింది. వేప చెట్టు విరిగిన చోట తాజా కణజాలం లేదు. లంక మట్టి మాదిరిగా ఉంది. గతంలో వృక్ష శాస్త్రవేత్తలు ఈ వింతను జన్యు లోపం, హార్మోనుల సమతౌల్యం లేకపోవడం వల్ల కోట్లలో ఒక చెట్టుకి ఇలా సంభవించే అవకాశం ఉందని వివరించారు. లక్షలాదిమందికి ఆశ్చర్యాను భూతులు పంచిన కలువ పువ్వు చెట్టు కాలగర్భంలో కలిసిపోయింది. పంచాయతీ వారు ఆ కొమ్మలను తొలగించి రోడ్డు మార్గం సుగమం చేశారు.