Telugu News Power

సారథుల సమాచార సేకరించిన నర్సాపురం జనసేన

​భీమవరం: జులై, 6( తెలుగు న్యూస్ పవర్. కామ్) నర్సాపురం పార్లమెంట్ “జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ” స్థానిక టౌన్ హాల్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. వారం పాటు ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంట్ పరిశీలకులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
​పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు ఈ వివరాల సేకరణ చేపట్టారు. చివరి రోజు నర్సాపురం పార్లమెంట్ పరిధిలో 2500 మందికి పైగా జన సైనికులు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో 300 మందికి పైగా శ్రేణులు దరఖాస్తులు
అందజేశారు.
​ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ, వారం రోజులుగా కష్టపడిన కమిటీ సభ్యులను, ప్రెసిడెన్షియల్ టీమ్‌ను అభినందించారు. తనకు ఈ బాధ్యతను అప్పగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.