
పాలకొల్లు: జూలై, 8( తెలుగు న్యూస్ పవర్. కం) మాజీ ముఖ్యమంత్రి, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల సృష్టికర్త, మహా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి ఉత్సవాలు వాడవాడల బుధవారం ఘనంగా జరిగాయి. స్థానిక యల్లవాని గురువు వై- జంక్షన్ వద్ద గల వైఎస్ఆర్ నిలువెత్తు విగ్రహానికి ఈ సందర్భంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్సిపి పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాల్ రావు గోపి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా, పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి నాయకులు వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు, ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లెం ఆనంద ప్రకాష్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎడ్ల తాతాజీ, పట్టణ అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ మద్ద చంద్రకళ, కర్రా జయ సరిత, జోగాడ ఉమామహేశ్వరరావు తదితరుకోలు నాయకులు పాల్గొన్నారు.
యలమంచిలి లో మండల అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ పాలకొల్లు నియోజకవర్గం ఇన్చార్జి గుడాల శ్రీహరి గోపాల్ రావు, మండల అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు, చిలువూరి కుమార దత్తాత్రేయ వర్మ పలువురు నాయకులు పాల్గొన్నారు.