Skip to main content

Telugu News Power

వాకర్స్ క్లబ్ నోటు పుస్తకాలు పంపిణీ.

యలమంచిలి:జూలై, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్)
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా యలమంచిలి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆర్యపేట విద్యార్థులకు పాలకొల్లు వాకర్స్ క్లబ్ వారు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ అధ్యక్షులు తటపర్తి సుధాకర్, కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, ఉపాధ్యక్షులు మానెం బసవ రాజు, కోశాధికారి పోతుల ఉమా శంకర్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండపాక రాంబాబు, విద్యా వాలంటీర్ బి.సునంద పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన*
వాకర్స్ క్లబ్ – పాలకొల్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.