Telugu News Power

నర్సాపురం-బెంగళూరు వారపు రెగ్యులర్ ఎక్స్ప్రెస్ సర్వీస్ ప్రారంభం.

పాలకొల్లు: జులై,9( తెలుగు న్యూస్ పవర్. కామ్) నర్సాపురం – బెంగుళూరు వారపు ప్రత్యేక రైలు నేటి నుంచి రెగ్యులర్ వారపు రైలుగా నడుపుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఇంతవరకు హీరోయిన్ ప్రత్యేక వారపురలుగా నడిపారు. స్థానిక పార్లమెంట్ సభ్యులు, కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ఈ రైలు ప్రయాణం అందుబాటులోకి రావటానికి తీవ్రంగా కృషి చేశారు. పాలకొల్లు రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం గం. 3.30 లకు ఎంపీ వర్మ పచ్చ జెండా ఊపి ఈ రైలు సర్వీస్ను ప్రారంభించనున్నారు. ఈ రైలు వల్ల ప్రస్తుతం ప్రయాణికులు చెల్లిస్తున్న 30 శాతం అధిక ధరలు తగ్గిపోతాయి. ఈ ప్రాంత నుంచి కర్ణాటకకు వలస వెళ్లిన ప్రజలకు, ఐటి ఉద్యోగులకు ఈ రైలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.