
పాలకొల్లు: జులై, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు దంపతులు స్వగ్రామం ఆగర్తిపాలెంలో స్వయంభు శ్రీ కోదండ రామాలయం పునర్నిర్మాణానికి గురువారం ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. శంకుస్థాపన కార్యక్రమానికి మేళ తాళాలు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. నిమ్మల దంపతులు పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి స్థానికులు, పలువురు కూటమి నాయకులు తరలి వచ్చారు.
