Skip to main content

Telugu News Power

ప్రపంచ జనాభా దినోత్సవం – అవగాహన కార్యక్రమం.

ప్రపంచ జనాభా దినోత్సవం సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ నాగరాణి

భీమవరం: జులై, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈనెల 11 నుంచి 18 వరకు జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.
స్థానిక కలెక్టరేట్ లోని వశిష్ట కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు.
కుటుంబాలు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలతో సంతోషకరమైన జీవనం సాగించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ర్యాలీలు, గ్రామసభలు, కౌన్సెలింగ్, హెల్త్ క్యాంపులు, ఇంటింటి ప్రచారం వంటి కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.