
విజయవాడ: జులై, 9( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఈ ఖరీఫ్ నుంచే పీపీ బ్యాగుల వినియోగం ప్రారంభిస్తామని రాష్ట్ర పౌరసర ఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. విజయవాడలో జరిగిన రెండేళ్ల ధాన్యం సేకరణ సమీక్ష, రాబోయే ఖరీఫ్ సీజన్ సన్నద్ధత సమావేశంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ రైతులతో మాట్లాడారు.ధాన్యం రవాణా ఖర్చులు 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ,
రెండేళ్లలో 74.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసినట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.ఈ ఖరీఫ్ నుంచే దశలవారీగా పీపీ బ్యాగులను వినియోగంలోకి తీసుకువస్తున్నామని వెల్లడించారు. రైతులు స్వయంగా మిల్లులకు ధాన్యం తరలిస్తే రవాణా ఖర్చులను 48 గంటల్లోనే చెల్లిస్తామని భరోసా ఇచ్చారు.
రెండేళ్లలో 10.32 లక్షల మంది రైతులకు రూ.17,592 కోట్లను వేగంగా చెల్లించామని తెలిపారు. రైతు సంక్షేమం, పారదర్శకత, సాంకేతికత ఆధారంగా మరిన్ని సంస్కరణలు తీసుకురానున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి రైతుల గురించి సమాచారం సేకరించి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. రైతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా రాబోయే ధాన్యం సేకరణకు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న రైతులు పాల్గొన్నారు.