స్థానిక టిడ్కో గృహ సముదాయము వద్ద రోటరీ క్లబ్ ఆఫ్ పాలకొల్లు సన్రైజ్, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, పాలకొల్లు, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల జిన్నూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆయుర్వేద దయచేసి శిబిరం గురువారం నిర్వహించారు. ఈ క్యాంప్ లో డా. గిరీష్, డా. మల్లీశ్వరి, వారి వైద్య సిబ్బందితో పాల్గొని 50 మంది రోగులకు దీర్ఘకాలిక వ్యాధులు అయిన కీళ్ళ వాతము, పక్షవాతం, చర్మరోగాలు స్త్రీరోగాలు మూత్రరోగాలు షుగర్, బి. పి, థైరాయిడ్, నరాలకు సంబంధించిన వ్యాధులకు, దైనందిన వ్యాధులైన జ్వరము,అతిసారం, దగ్గు, జలుబు, తలనొప్పి, గొంతునొప్పి గాయములు మానని పుండ్లు మొదలగు వాటికి ఉచితంగా మందులు ఇచ్చి ఆయుర్వేద వైద్య విధానం ద్వారా మధుమేహా నియంత్రణ,తీసుకోవలసిన ఆహార పదార్థాలు,ఆరోగ్యవంతమైన జీవనం కొరకు యోగా సాధన గురించి వివరించటం జరిగింది.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ పాలకొల్లు సన్రైజ్ ప్రెసిడెంట్ మాజేటి సూర్యనారాయణ (రాజా), సెక్రటరీ నెలకుర్తి కృష్ణమోహన్, ట్రెజరర్ శ్రీకాంత్ పాటిల్, చార్టర్ ప్రెసిడెంట్ చవాకుల సూర్య నరేష్ బాబు, సిరిగినీడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
సన్రైజ్ రోటరీ క్లబ్ వైద్య శిబిరం