
పాలకొల్లు: జులై, 10( తెలుగు న్యూస్ పవర్. కామ్)
నరసాపురం-బెంగుళూరు ఎక్స్ప్రెస్ రైలు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి, స్థానిక లోక్ సభ సభ్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ శుక్రవారం పాలకొల్లు రైల్వే స్టేషన్ నుంచి జండా ఊపి ప్రారంభించారు. ఇంతవరకు ఈ రైలు ప్రత్యేక వారపు రైలుగా నడిచేది. కేంద్రమంత్రి కృషి వల్ల ఈ రైలు రెగ్యులర్ వారపు ఎక్స్ప్రెస్ సర్వీస్ గా రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రైలు(17293) ప్రతి శుక్రవారం నరసాపురం రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం గం. 3.50 లకు బయలుదేరుతుంది, శనివారం ఉదయం గం.9. 45 లకు బెంగుళూరు చేరుకుంటుంది. ఈ రైలు వల్ల ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేక కేటగిరి నుంచి ఈ రైలును తొలగించటం వల్ల ఇప్పటివరకు అదనంగా చెల్లించిన 30 శాతం టిక్కెట్టు ధర తగ్గుతుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నర్సాపురం నుంచి మరిన్ని హీరోయిన్లు రాకపోకలు సాగించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నరసాపురం – బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్, వారణాసి, విశాఖపట్నం వైపు నడిచే కొత్త రైలు సర్వీసులు ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, డి యు ఆర్ సి సభ్యులు జక్కంపూడి కుమార్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, సొసైటీ అధ్యక్షులు డేగల సత్తి కొండ, బిజెపి నాయకులు పొట్టుపోతు శ్రీను, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలకుల చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు కార్మూరు వెంకట నరసింహారావు ఆధ్వర్యంలో రైలు సౌకర్యాలు మెరుగుదల కోసం వినతి పత్రం సమర్పించారు.