Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మను దర్శించుకున్న జే సీ కల్ప శ్రీ

అమ్మవారి చిత్రపటం స్వీకరిస్తున్న జెసి కల్పశ్రీ

భీమవరం: జులై, 10 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వెంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం, నూతన జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కె.ఆర్ కల్ప శ్రీ దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ వీరికి పూజలు,ఆశీర్వచనాలు నిర్వహించి శేషవస్త్రం తో సత్కరించారు.పశ్చిమ గోదావరి జిల్లా దేవదాయ ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హరిసూర్య ప్రకాష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, వుదీశి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గొంతెన రమణ పాపోలు ఏడుకొండలు వీరికి అమ్మవారి ప్రసాదం చిత్రపటం అందజేసారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.