Telugu News Power

కుళాయి చెరువు నిర్మాత చెరుకూరి లక్ష్మణరావు విగ్రహావిష్కరణ లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు.

ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు

నర్సాపురం: జూలై, 11 (తెలుగు న్యూస్ పవర్.కాం) నర్సాపురం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చిన కుళాయి చెరువు నిర్మాత, కీర్తిశేషులు చెరుకూరి లక్ష్మణరావు నిలువెత్తు విగ్రహానికి శనివారం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు పొంగూరి నారాయణ, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి, ఎంపీ, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, ఆచంట ఎమ్మెల్యే, భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఎంపీ గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, పిఎసి చైర్మన్ పులపర్తి అంజిబాబు, కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెరుకూరి నరసాపురం పట్టణానికి అందించినచిరస్మరణీయ సేవలను వక్తలు కొనియాడారు.