పాలకొల్లు: జూలై, 12( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానికంగా రొయ్యల దాణ ఫ్యాక్టరీ, కోల్డ్ స్టోరేజీ ఏర్పాటుకు సహకరించవలసిందిగా అధికారులకు రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు విజ్ఞప్తి చేశారు. స్థానిక జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా గాంధీ భగవాన్ రోజు హాజరై మాట్లాడారు. ప్రస్తుతం రొయ్యల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పలుపరిష్కారాల గురించి సమావేశంలో చర్చించారు. రొయ్యల రైతులే సొంతంగా ఫీడ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకోవడానికి, మార్కెట్ పరిస్థితులు బట్టి నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్, నిర్మాణానికి అధికారులు మార్గదర్శనం చేయవలసిందిగా కోరారు. రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల గురించి స్థానిక సచివాలయాల్లో రైతులకు అందుబాటులో ఉంచవలసిందిగా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎంపెడ, మత్స్యశాఖ తదితర ప్రభుత్వ శాఖలు ఆక్వా రైతులకు అందిస్తున్న వివిధ రకాల పథకాల గురించి విస్తృతంగా అవగాహన కల్పించడానికి కరపత్రాలు ద్వారా ప్రచారం చేస్తామని రాజు తెలిపారు. విద్యుత్ సబ్సిడీకి సంబంధించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతులు ఖర్చు కోసం ఆలోచించకుండా తమ చెరువులకు స్వయంచాలిత విద్యుత్ కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలని రైతులను కోరారు. ఇందు వల్ల సొమ్ము ఆగ అవటమే కాకుండా, సరఫరా లోపాల వల్ల చెరువులకు జరిగే నష్టాన్ని కూడా నివారించవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో పాలకొల్లు జై భారత్ శ్రీరామ్ రామరాజ సంఘం అధ్యక్షులు బోనం వెంకట నరసయ్య చినబాబు పెరుమార్చి సత్యనారాయణ రాజు గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు తదితరులు, అధికారులు పాల్గొన్నారు.
పాలకొల్లు లో మేత ఫ్యాక్టరీ, కోల్డ్ స్టోరేజీ కి రొయ్యల రైతుల సన్నాహాలు.
సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షులు గాంధీభవరాజు