Skip to main content

Telugu News Power

రాష్ట్ర ఆక్వా రైతు సంఘం కార్యాలయ ప్రారంభం. -అధ్యక్షులు,గాంధీ భగవాన్ రాజు.

రాష్ట్ర ఆక్వా రైతు సంఘం కార్యాలయ ప్రారంభోత్సవం లో గాంధీ భగవాన్ రాజు

పాలకొల్లు: ఆగస్టు,17 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ఆక్వా రైతు సంఘ కార్యాలయం, విజయవాడలోని కానూరులో
ఆదివారం ప్రారంభించినట్టు రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు సోమవారం పాలకొల్లులో తెలిపారు. ఇటీవల రొయ్యల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరపటానికి వేదిక అవసరమైన సందర్భంగా, ఈ నూతన కార్యాలయంలో గృహప్రవేశం చేసినట్టు వెల్లడించారు.
ఈ కార్యక్రమములో,
ఉపాధ్యక్షులు ఈదర యశ్వంత్,కోశాధికారి మధుసూదన రావు,
సభ్యులు సత్తిబాబు రాజు,బోసు రాజు,వెంకట రాజు, నాని,సజ్జా బుజ్జి,సతీష్, ఆనంద గజపతిరాజు, పెనుమత్స సత్యనారాయణ రాజు కృష్ణశ్రీ,రామలింగ రాజు, కార్యదర్శి నాగభూషణం కుమారుడు కోనసీమ జిల్లా కార్యదర్శి పాల్గొన్నారు.