Skip to main content

Telugu News Power

సీ.ఎం. మానస పుత్రిక ఆక్వా రంగం.

కృతజ్ఞతలు తెలియజేస్తున్న మంత్రి నిమ్మల
ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ జీవో 57 విడుదల చేస్తున్న దృశ్యం.

రైతులను అన్ని విధాల ఆదుకుంటాం.
-వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి అచ్చెం నాయుడు.

పాలకొల్లు:ఆగస్టు,11( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర అభివృద్ధికి అక్వా రంగం వెన్నుదన్నుగా నిలుస్తుందని గుర్తించి, అక్వారంగాన్ని అభివృద్ధి చేయటంలో చంద్రబాబు దూర దృష్టి ఉందని రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెం నాయుడు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆక్వా రైతులకు యూనిట్ కు రూ. 1.50 పై. ల కే విద్యుత్తు అందించే బృహత్తర పధకానికి, స్థానిక బైపాస్ రోడ్ లో మంగళవారం నిర్వహించిన రైతు మహాసభలో, వేలాది మంది రైతుల సమక్షంలో జీవో నెంబర్ 57 విడుదల చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తడ నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న పొడవైన తీర ప్రాంత, సహజ సంపద వల్ల అక్వారంగాన్ని అభివృద్ధి చేసి, రాష్ట్రానికి ఆర్థిక వనరుగా మార్చుకోవటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఆక్వా రైతుల ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడానికి రైతులను, పరిశ్రమ వారిని వెంటబెట్టుకుని నేరుగా ఢిల్లీ వెళ్లి వారితో సమావేశం ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని దేనిని తెలిపారు. దేశంలో దాణా ధరలు పెరగటానికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పు కారణమని తెలిపారు. ఇతర దేశాల ఫిష్ మీల్, ఫిష్ ఆయిల్, సోయా ఎగుమతి కావటం వల్ల దేశంలో దాణా ధరలు అనివార్యంగా పెంచవలసి వస్తుందన్నారు. అయినప్పటికీ ఒకసారి పెరిగిన ధరలు తగ్గించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఆక్వా రైతులను ఆదుకోవడానికి, సోయా ఎగుమతుల్లో సగభాగం దేశంలో వినియోగించేలా చట్టం తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అదే జరిగితే రైతులకు ఊరట లభిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి మనసుతో, కష్టం తెలిసిన వ్యక్తిగా, నిరంతరం చేస్తూ వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రం ని ఆక్సిజన్ తీసుకుని వస్తాయి ఆర్థిక రంగాన్ని పునరుద్ధరించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేని సమస్యలు సృష్టించి కూటమి ప్రభుత్వం పై తప్పులు నెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. రైతులను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, రైతులు వైఎస్ఆర్ పార్టీని, నిలదీసి, తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో భార్యాభర్తలు కూడా స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం నిరసన తెలియజేసే ప్రయత్నం చేస్తే, ముందుగానే గృహనిర్బంధం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వారే ఇప్పుడు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ గురించి రోడ్డు మీదకు వస్తున్నారని విమర్శించారు. గొడ్డలి పార్టీని ఒకసారి నమ్మి రాష్ట్రం విధ్వంసం పాలు అయిందని, మళ్లీ ఆ పొరపాటు చేస్తే రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం ఆదరాబాదరాగా ప్రారంభించిన ఆక్వా యూనివర్సిటీకి రూ.30 కోట్ల అప్పు మిగిల్చి వెళ్లారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వము వచ్చాక, 27 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు.’ యూనివర్సిటీ ప్రస్తుతం, సచివాలయంలో పంచాయతీలలో నడుస్తుందని దాన్ని యూనివర్సిటీ అంటారా అని ప్రశ్నించారు
గత జగన్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖ ద్వారా లక్షన్నర కోట్లు, ట్రూ అప్ చార్జీల ద్వారా ప్రజలపై 80 వేల కోట్ల రూపాయల వరకు వసూలు చేసిన సొమ్ము ఏం చేశారని ప్రశ్నించారు. గత ప్రభుత్వం విద్యుత్ డిస్కమ్ లను నాశనం చేసిందని ఆరోపించారు. రాష్ట్రానికి మూలాధారమైన, జలవనరుల ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం మూలను పెట్టిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రూ 57 వేల కోట్లతో ప్రాజెక్టుల పని పూర్తి చేయడానికి కృషి చేస్తున్న అన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో సాగునీటి సరఫరా వ్యవస్థకు 1500 కోట్ల రూపాయల నిధుల అవసరం ఉందని, అందుకు సీఎం చంద్రబాబు నాయుడు ద్వారా కృషి చేస్తున్నామన్నారు. ఆ నిధులు మంజూరు అయితే ఉపయోగ గోదావరి జిల్లాలో రైతులకు సాగునీటి సమస్యలు పూర్తిగా సమసిపోతాయి అన్నారు. పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విద్యుత్ సబ్సిడీ జీవో రైతుల దగ్గరికి వెళ్లి, వారి సమక్షంలోనే, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తామంత ఇక్కడ హాజరైనట్టు వెల్లడించారు. ఈ జీవో వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1100 కోట్ల ఆర్థిక భారం పడుతుందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల వారిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయల సబ్సిడీని భరిస్తుందని తెలిపారు. పాలకొల్లు పరిసర ప్రాంతాల్లోనే విద్యుత్ సరఫరా అభివృద్ధి కోసం 500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో 220 కెవి విద్యుత్ సబ్స్టేషన్ జరిగిందని త్వరలోనే పనులు ప్రారంభిస్తారని వెల్లడించారు, నరసాపురంలో కూడా విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు అయిందన్నారు. లేనివిధంగా ట్రూ అప్ చార్జెస్ ద్వారా జగన్ ప్రభుత్వం ప్రతి ఏటా దాదాపు 11 సార్లు చార్జీలతో పెంచితే తమ ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, ట్రూ డౌన్ లో చార్జీలతో ప్రజలపై ఒక్క రూపాయి భారం కూడా పడకుండా, చూసామన్నారు. రైతులు విద్యుత్ శాఖకు సంబంధించి ఏ సమస్యలు ఉన్న తన దగ్గరకు తీసుకొస్తే పరిష్కార మార్గాల ఆలోచిస్తాను అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ఆక్వా రంగం 1996 నుంచి విద్యుత్ కోసం, రైతులు పడిన పాట్లు వివరించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.3. 85 పైసల యూనిట్ ధర రూ.2తగ్గించి రైతుల జీవితంలో వెలుగులు నింపిందని వెల్లడించారు. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి మోడీ ఆశీస్సులతో, కూటమి ప్రభుత్వం ఎకరానికి 84 వేల రూపాయలు సబ్సిడీ బహుమానంగా ఇచ్చిందన్నారు. అందుకు కృతజ్ఞతా పూర్వకంగా పాలకొల్లు మాకు రైతు నివేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపసభావతి రఘురాం కృష్ణంరాజు మాట్లాడుతూ, ఆక్వా యూనివర్సిటీ, మానవ ప్రమేయాన్ని తెగించి, ఆధునిక పద్ధతులు ద్వారా ఆక్వా సాగు పరిశోధన చేయాలని సూచించారు. గుడి వాడ ఎప్పుడు వెనిగండ్ల రాము మాట్లాడుతూ, ధరల స్థిరీకరణకు సంబంధించి ప్రాజెక్టుగా గుడివాడలో ప్రారంభించిన పథకం, రెండవ దశలో రాష్ట్రవ్యాప్తంగా వర్తింప చేయడానికి ప్రయత్నం జరుగుతుందని వెల్లడించారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, ప్రస్తుత జీవో మేరకు,నిబంధన సడలింపు వల్ల జిల్లాలో 4,000 మంది రైతులకు అదనంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. మత్స్యశాఖ కమిషనర్ నాయక్ మాట్లాడుతూ, మనం వచ్చే సంపదకు ఈక్వేడార్ దేశంతో పోటీ ఉందన్నారు. ఒక కేజీ రొయ్య ఉత్పత్తికి వంద రూపాయల వరకు వారికి మనకంటే తక్కువ ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ సభలో రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ, విద్యుత్ సబ్సిడీ జీవో విడుదల చేసిన కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ఆక్వా రైతు సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖపట్నం జరిగిన నీలి విప్లవ ఆర్థిక యోజనాల కోసం ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో రైతుల కోరిక మేరకు క్వారంటైంన్ కేంద్రం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆక్వా రైతులకు సంబంధించి ఇతర సమస్యలపై వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. బిజెపి సీనియర్ నాయకులు,ఎమ్మెల్సీ, సోము వీర్రాజు మాట్లాడుతూ, మత్స్య సంపద ద్వారా లక్ష కోట్ల రూపాయల ఆదాయం సంపాదించడానికి “ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన”పథకం ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు. ఈ పధకం ద్వారా 60 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది అన్నారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, వైసిపి వారు చొక్కాలు ఇప్పుడు తిరుగుతూ, విధ్వంశాలు సృష్టించి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని, వారి పట్ల అప్రమత్తగా ఉండాలని సూచించారు. జగన్ ప్రభుత్వం లో ఆక్వా రైతులకు చేసిన మేలు చర్చించడానికి రావాలని సవాలు విసిరారు. ఈ సభలో మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే, పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, ఎమ్మెల్యేలు, కామినేని శ్రీనివాస్, ఆరమిల్లి రాధాకృష్ణ, దేవ వరప్రసాద్, బొమ్మడి నాయకర్, సత్యనారాయణ, పత్సమట్ల ధర్మరాజు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళి,ఆక్వా రైతు సంఘం నాయకులు, చినబాబు, మేడిది జాన్ డేవిడ్ రాజు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, బూన్ రాజు, పెనుమత్స రాంభద్ర రాజు, కర్నెని గౌర్నాయుడు, మామిడిశెట్టి పెద్దిరాజు, పెచ్చేట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, పీతల సుజాత, శ్రీనివాస్, ఉన్నమట్ల కాపర్తి, తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఆక్వా రైతులు తరలివచ్చారు. జీవో విడుదల సందర్భంగా వేలాది మంది రైతులు తమ పరిషత్ ద్వారా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, మంత్రి నిమ్మల రామానాయుడు శ్రమించి ఏర్పాటుచేసిన ఈ సభ అంచనాలకు మించి విజయవంతం కావడంతో కూటమి శ్రేణుల్లో సంతోషం, సంతృప్తి వ్యక్తమవుతున్నాయి.

విద్యుత్ శాఖ మాత్యులు రవికుమార్, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు
కృతజ్ఞత సభలో మాట్లాడుతున్న మంత్రి అచ్చేం నాయుడు