Telugu News Power

వివిధ సంస్థలకు అంబులెన్స్ కు రూ లక్ష 30 వేలు సహకారం.

ఇన్నర్ వీల్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అంజిబాబు

ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ 302, 35వ అసెంబ్లీ క్లింకార ప్రారంభం

ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ చైర్మన్ గా అరేటి రాణి రత్నకుమారి ప్రమాణ స్వీకారం.

భీమవరం : జులై, 13( తెలుగు న్యూస్ పవర్. కామ్)
ప్రపంచ వ్యాప్తంగా మహిళల సారథ్యంలో నడుస్తున్న అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థలలో ఒకటి ఇన్నర్ వీల్ క్లబ్ అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం ఆనంద పంక్షన్ హాల్లో భీమవరం ఇన్నర్ వీల్ క్లబ్, భీమవరం బ్లోసమ్స్ అధ్వర్యంలో ఆదివారం ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ 302, 35వ అసెంబ్లీ క్లింకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ చైర్మన్ గా అరేటి రాణి రత్నకుమారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఇన్నర్ వీల్ క్లబ్ విద్య, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, ఆరోగ్య శిబిరాలు, అత్యవసర సహాయం వంటి ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇంటర్నేషనల్ ఇన్నర్ వీల్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ సరిత లునాని మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద మహిళా సేవా సంస్థల్లో ఇన్నర్ వీల్ క్లబ్ ఒకటి అని, 100కు పైగా దేశాల్లో దాదాపు లక్ష మందికి పైగా సభ్యులతో మహిళా సాధికారత అని అన్నారు. డిస్ట్రిక్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అరేటి రాణి మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించి క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ బాలికల హాస్టల్ కు రూ 50 వేలు బి కనకదుర్గ సహకారంతోను, అదే విధంగా సెయింట్ మేరీస్ ప్లేలేటివ్ కు రూ 30 వేలు,
ఏలూరు అంబులెన్స్ కు రూ 25 వేలు, ప్లస్ ఆర్గనైజింగ్ రూ 25 వేలు సహకరాన్ని అందించామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు సతీమణి సత్యవాణి, భీమవరం ఇన్నర్ వీల్ క్లబ్ చైర్మన్ గంధం శ్రీదేవి, క్లబ్ అడ్వైజర్ బి కనకదుర్గ, కో చైర్మన్ పి ప్రమీల, సెక్రటరీ సిహెచ్ అమ్మాజీ, జాయింట్ సెక్రెటరీ బి ప్రత్యూష, ట్రెజరర్ ఐ రమ్య తదితరులు పాల్గొన్నారు.