Telugu News Power

రాజకీయ ముసుగు వెయ్యొద్దు రొయ్యల రైతుల పైన. -జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం ఖండన.

ఆక్వా రైతు సంఘంపై విమర్శలను తిప్పి కొడుతున్న బోనం చినబాబు.

పాలకొల్లు: జూలై, 15( తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతు సంఘాల ముసుగులో రాజకీయ పార్టీలకు వంత పలుకుతున్నారన్న వైసీపీ నాయకుల విమర్శను జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం తీవ్రంగా ఖండించింది. వైసిపి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమవరం సభకు హాజరవుతున్న సందర్భంగా వైసీపీ నాయకులు అవాస్తవాలు మాట్లాడటం తగదు అన్నారు. విమర్శలు చేసిన నాయకులు అసలు ఆక్వా రైతుల కాదని వివరించారు. అందువల్ల ఆక్వా రైతులు కష్టసుఖాలు వారికి తెలియని పేర్కొన్నారు. ఆక్వా రైతు సంఘం రాజకీయాలకు అతీతంగా, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు. రైతులు దమ్ము కష్టపడి పండించిన రొయ్యల పంటను రోడ్లపై పారవేసి నిరసన తెలపడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల కోసం చేసిన ఉద్యమంగా గుర్తించాలన్నారు. ఆక్వా రైతు సంఘానికి నిరంతరం తన సేవలను ఇస్తూ, రాష్ట్రస్థాయి అధ్యక్షులుగా ఎన్నికైన గాంధీ భగవాన్ రాజు ఎంత కష్టపడుతున్నారు రైతులకు తెలుసునన్నారు. రొయ్యల రైతులకు సబ్సిడీఫై విద్యుత్ సరఫరా ఇచ్చినప్పటికీ, జోలుగా విడగొట్టడం వల్ల రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ట్రాన్స్ఫార్మర్ మూడున్నర లక్షల నుంచి 10 లక్షల కు పెంచింది వైసీపీ ప్రభుత్వం అని గుర్తు చేశారు. రైతుల నుంచి సరైన సమాచారం సేకరించి మాత్రమే మాట్లాడాలని కోరారు. రొయ్యల రైతులతో రాజకీయం చేయడం వల్ల రైతులు వారిని చీకొట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు. స్థానిక క్షీరా రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు బోనం వెంకట నరసయ్య, చినబాబు బుధవారం ఈ సమావేశం నిర్వహించారు. కార్యదర్శి పెనుమత్స సత్యనారాయణరాజు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.