Skip to main content

Telugu News Power

కాపు ఉద్యమ నేత ముద్రగడకు ఘన నివాళి.

ముద్రగడపు ఘన నివాళి

పాలకొల్లు: జూలై, 15 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) మాజీ మంత్రి, మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కు స్థానిక పట్టణ ప్రముఖులు, ముద్రగడ అభిమానులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు కాపు జాతి ఐక్యత కోసం ముద్రగడ చేసిన సేవలను కొనియాడారు. పాలకులతో వారికి ఆత్మీయ అనుబంధం ఉందని, తరచు వారు పాలకొల్లు సందర్శించే వారిని గుర్తు చేశారు. ముద్రగడ మరణం తీరని ఓటమి వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వంగ నరసింహారావు, యెర్రంశెట్టి వెంకటరత్నం, చేగొండి సూర్య ప్రకాష్, చపాకుల సూర్య నరేష్, గుండుమొగుల వీరస్వామి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.