Skip to main content

Telugu News Power

ముద్రగడకు యలమంచిలి మండలంలో ఘన నివాళి.

మేనపాడు సెంటర్లో ముద్రగడకు ఘన నివాళి

య లమంచిలి: జులై, 15( తెలుగు న్యూస్ పవర్. కామ్) మండలంలోని మేడపాడు సెంటర్లో పలువురు నాయకులు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి,, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం మృతికి బుధవారం ఘన నివాళులు అర్పించారు. ముద్రగడ కాపుల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేశారని వక్తలు కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను ఆయన తన జీవితంలో ఆచరించి చూపిన వ్యక్తిని ప్రశంసించారు. ఆయన బాటలో నడిచిన ముద్రగడ బలహీన వర్గాల వారు స్త్రీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చివటపు నాగేశ్వరరావు, రావూరి మురళీకృష్ణ, గుర్రాల వెంకట్రావు, టిడిపి నాయకులు కషాసత్య, బిజెపి నాయకులు వీరాజీ తదితరులు పాల్గొన్నారు.