పెనుగొండ: జులై,21( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కాకిలేరు గ్రామానికి చెందిన జవ్వాది లక్ష్మీ ప్రశాంతి మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ లో 470 మార్కులకు 466 మార్కులు సాధించింది. రెండవ సంవత్సరం ఫీజు చెల్లించలేని పరిస్థితిని ఉపాధ్యాయులు వాకర్స్ క్లబ్ పాలకొల్లు దృష్టికి తీసుకురావడం తో క్లబ్ సభ్యులు ఆమెకు 20 వేల రూపాయలు, పాలకొల్లు బివిఆర్ ఎమ్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి లో 576 మార్కులు పొంది ట్రిపుల్ ఐటీ ఇడుపుల పాయ లో సీట్ సాధించిన షేక్ నస్రత్ బేగం కుటుంబానికి రూ. 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు క్లబ్ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం కొత్త కుళాయి చెరువు వద్ద అందించారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, ఉపాధ్యక్షుడు మానెం బసవరాజు కోశాధికారి పోతుల ఉమాశంకర్ రావు, జవ్వాజి కల్యాణ్, కఠారి నాగేంద్ర కుమార్, సోమంచి శ్రీనివాస శాస్త్రి, ధనాని సూర్యప్రకాష్, టంగుటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
వాకర్స్ క్లబ్, పాలకొల్లు రూ.30 వేల ఆర్థిక సాయం.
విద్యార్థులకు సహాయం చేస్తున్న వాకర్స్ క్లబ్