పాలకొల్లు: జూలై, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరుల పెన్ డౌన్ నిరసన కార్యక్రమం మూడో రోజుకు చేరింది. రిజిస్టార్ ఆఫీసు పరిధిలోని లేఖర్లను సంఘటిత పరుస్తూ నిరసన కొనసాగిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద రిజిస్ట్రేషన్ చేయటానికి ఎవరిని సాహసించటానికి అంగీకరించడం లేదు. వారిని ఏదో విధంగా వెనక్కు తిప్పి పంపుతున్నారు. దీంతో గత మూడు రోజులుగా రిజిస్ట్రేషన్లు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన జీవో నెంబర్ 396 ను తక్షణమే భే షరతుగా రద్దు చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఇది రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరించటానికి ప్రవేశపెట్టిన ప్రతిపాదనగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందువల్ల ప్రజల ఆస్తులకు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో రక్షణ ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వలె దస్తావేజు లేఖర్లకు ఈ లైసెన్సులు పునరుద్ధరించాలని కోరుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం బుధవారం రిజిస్టర్ కార్యాలయం నుంచి బయలుదేరి స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. పోడూరు, తాసిల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి తమ డిమాండ్ల వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వానికి ఈ డిమాండ్లను తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో, అధ్యక్షులు తాళ్లూరు వెంకటేశ్వరరావు, కార్యదర్శి కడలి శ్రీనివాస్, కపిల కృష్ణ, కోశాధికారి, కొల్లిపర అమ్మిరాజు, గోటేటి హనుమంతరావు, శ్రీనివాస్, కృత్తివెంటి రవికాంత్ దంపతులు, దేవళ్ళ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
విస్తరిస్తున్న నిరసనలు, పట్టు బిగిస్తున్న లేఖర్లు.
దస్తావేజులేఖర్లు పోడూరు తాసిల్దార్ కు వినతి పత్రం అందజేస్తున్న దృశ్యం.