Telugu News Power

చాంబర్స్ కళాశాలలో ఇన్కమ్ టాక్స్ డే.

ఆదాయపు అధికారి ప్రభాకర్ ను సత్కరిస్తున్న చైర్మన్ నరసింహారావు

పాలకొల్లు: జూలై,22( తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ కళాశాలలో 167 వ ఇన్కమ్ టాక్స్ డే బుధవారం జరిగింది. ఆదాయపు పన్ను పై ఔట్రిచ్ ప్రోగ్రాం డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ పాలకొల్లు వారు సంయుక్తంగా నిర్వహించారు. “అవర్ టాక్సెస్ అవర్ ఫ్యూచర్ స్ట్రాంగర్ టుగెదర్ ఫర్ బెటర్ ఇండియా” అనే నినాదంతో ఈ ఇన్కమ్ టాక్స్ ప్రోగ్రాం లో బీ.కాం అండ్ బి.బి.ఏ విద్యార్థినీ విద్యార్థులకు ఇన్కమ్ టాక్స్ పై అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఛాంబర్స్ కళాశాలల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహరావు మాట్లాడుతూ, మనం ప్రభుత్వానికి కట్టే పన్నులు ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన నిధులను అందిస్తుందన్నారు. ఈ ఆదాయాన్ని రోడ్ల నిర్మాణం విద్య ఆరోగ్య సంరక్షణ మరియు రక్షణ వంటి వివిధ ప్రజా సేవలకు వినియోగిస్తారని, ఆర్థిక అభివృద్ధి కి సహాయపడుతుందని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక ఆదాయపు పన్ను అధికారి ప్రభాకర్ దంతుర్తి మాట్లాడుతూ, భారతదేశంలో సహా ప్రపంచంలోనే అన్ని పెద్ద దేశాలు ప్రజల సంపాదనపై పన్ను విధించబడుతుందన్నారు. కష్టపడి సంపాదించిన దాంట్లో ప్రభుత్వం ఎందుకు పన్ను రూపంలో తీసుకుంటుంది, అసలు ఇన్కమ్ టాక్స్ అంటే ఏంటి ప్రభుత్వం ఈ టాక్స్ ఎందుకు వసూలు చేస్తుంది? టాక్స్ కట్టడం వల్ల ప్రయోజనాలేంటి? ఇన్కమ్ టాక్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఇలాంటి అనేక విషయాలపై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించి వారికి పన్నుల గురించి వివరించారు. ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ గిరీష విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ ప్రోగ్రాం నిర్వహించారు.క్విజ్ లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాకేష్ ఓఎస్ ఇన్ ఐటీ డిపార్ట్మెంట్, కళాశాలల సెక్రటరీ కే సీతారామరాజు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి వెంకటేశ్వరరావు, కామర్స్ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు .