Skip to main content

Telugu News Power

దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ జయంతి వేడుక- పట్టణ ప్రముఖుల నివాళి

కోడి రామకృష్ణ జయంతి వేడుకలో పాల్గొన్న ప్రముఖులు

పాలకొల్లు: జులై, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) శతాధిక చిత్రాల దర్శకుడు, తెలుగు చలనచిత్ర గతిని మార్చిన దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ 77వ జయంతి వేడుకలు గురువారం ఆయన మాతృభూమి, స్థానిక సొంత థియేటర్ మారుతిలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వంగా నరసింహారావు మాట్లాడుతూ, పాలకొల్లు కీర్తిని పెంచిన గొప్ప వ్యక్తులు దాసరి నారాయణ రావు, కోడి రామకృష్ణలు అని కొనియాడారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, జీవి మాట్లాడుతూ, స్వయంకృషితో ఉన్నత శిఖరాలకు అధిరోహించిన గొప్ప వ్యక్తి కోడి రామకృష్ణ అని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు జక్కంపూడి కుమార్ మాట్లాడుతూ, తెలుగు సినిమా రంగంలో గ్రాఫిక్స్ ను ప్రవేశపెట్టి, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలుగజేసిన గొప్ప సాంకేతికతను తెలుగు చిత్ర సీను పరిచయం చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోడి రామకృష్ణ బాల్య స్నేహితుడు కొయ్యన సూర్యనారాయణ, మేడికొండ శ్రీనివాసరావు చౌదరి , భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు కొల్లి కొండ ప్రసాద్, టిడిపి నాయకులు పొట్నూరి శ్రీనివాస్,యర్రంశెట్టి వెంకటరత్నం, మానాపురం సత్యనారాయణ, కొణిజేటి గుప్త, మారుతి థియేటర్ మేనేజర్ దేవళ్ళ బుజ్జి, రెడ్డి బాలు తదితరులు పాల్గొన్నారు.