పాలకొల్లు ముద్దుబిడ్డ స్వర్గీయ పద్మశ్రీ అల్లు రామలింగయ్య వర్ధంతి సందర్బంగా టాక్సీ స్టాండ్ వద్ద ఆయన కాంశ్య విగ్రహం వద్ద తులా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అల్లు రామలింగయ్య నాటక రంగం నుంచి సినీ రంగానికి వెళ్లి తొలినాళ్లలోనే మద్రాసు పరిశ్రమలో పాలకొల్లు ఖ్యాతిని చాటారని తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని, జైలు కూడా వెళ్లారని వెల్లడించారు. హోమియో వైద్యునిగా అనేక మందికి సేవలందించారనిసీ వెల్లడించారు.ఆయన పరిశ్రమకు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ఐకాన్ స్టార్, జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గ్రహీత అల్లు అర్జున్ లాంటి ఉద్దండులను అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శిడగం సూరి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూర్మా శ్రీను, కొమ్ముల దినేష్,గణేష్, సాయి,ఆనంద్, నవీన్,మున్నా, భాను,సత్తిబాబు,అభి,తదితరులు పాల్గొన్నారు
అల్లు రామలింగయ్యకు నివాళులర్పిస్తున్న అభిమానులు