Skip to main content

Telugu News Power

పొలాలకు జాలాభిషేకం పవన్ కు పాలాభిషేకం. పిఠాపురం రైతుల హర్షతిరేకం.

పవన్ పై కుట్రలను ఖండిస్తున్న మహిళా రైతులు

పిఠాపురం:జులై, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతులు పంట విరామం ప్రకటించాలని అధికారుల హుకుం జారీచేయడం తో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గ రైతులు ఆందోళనతో డిలాపడ్డారు. అప్పటికే ఉపముఖ్యమంత్రి ఫై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇందులో రాజకియ కుట్ర కూడా ఉందని, పవన్ ను రాజకీయంగా బలహీన పరచడానికి, కూటమి లోని కొందరు నాయకులు ఈ అంశాన్ని వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స తర్వాత, విశ్రాంతి తీసుకోవాలని హెచ్చరించినా పట్టించుకోకుండా, తన విధినిర్వహణలో నిమగ్నమాయ్యారు. నీటి సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే, ఉపముఖ్యమంత్రి కార్యాచరణ చేపట్టారు. సాక్షాత్తు జలవనరుల శాఖామాత్యలు నిమ్మల రామానాయుడిని రంగంలోకి దింపారు. మంత్రి రెండు రోజులు బస చేసి, 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించారు. దీంతో రైతుల్లో పంటపై మళ్ళీ ఆశలు చిగురించాయి. పొలాలకు జలాభిషేకం చెయడంతో ఆనందాహర్షాతిరేక్కాలతో రైతులు పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం చేశారు. మంత్రి నిమ్మల కు కృతజ్ఞతలు తెలిపారు.

పవన్ పై కుట్రలను ఖండిస్తున్న మహిళా రైతులు