పాలకొల్లు: ఆగస్టు,6( తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజముద్ర తో కూడిన పట్టాదారు పాసుపుస్తకం రైతుల పొలాలకు భద్రత కల్పిస్తుందని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు పేర్కొన్నారు. అంగర స్వగ్రామం, కాపవరంలో గురువారం “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా మాట్లాడుతూ, తాతల నాటి నుంచి వస్తున్న రైతుల ఆస్తుల పాస్ పుస్తకం పై మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటో వేసి రైతులను భయాందోళనకు గురిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అంగర రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. తాశీల్దార్ యడ్ల దుర్గా కిషోర్, మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న రైతుల పట్టాదారు పాసు పుస్తకం శత్రుదుర్భేద్యమైన 13 అంచల రక్షణ కవచంతో తయారు చేశారన్నారు. ఇందులో ఇచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా రైతు యొక్క వివరాలు సమగ్రంగా పొందవచ్చునని వెల్లడించారు. గతంలో వలె సర్వేనెంబర్ కాక ప్రస్తుతం పొలాలకు ఎల్పీ నెంబర్ ఇస్తారని, అందువల్ల రైతులు ఇక సర్వే నంబర్ మరిచిపోవాలని సూచించారు. గతానికి భిన్నంగా రైతు పొలాలు ఎక్కడెక్కడ ఉన్నా సమీపంలోని ఒకే ఎల్ పి నెంబరులో పొందుపరచి ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోలాటి రాధ, పలువురు రైతులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
రైతు పొలానికి భద్రత, రాజముద్ర పాసుపుస్తకం. -మాజీ ఎమ్మెల్సీ అంగర