Skip to main content

Telugu News Power

స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి. బిజెపి శ్రేణులకు పిలుపు.

పాలకొల్లు: ఆగస్టు, 6( తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతీయ జనతా పార్టీ భవిష్యత్తును, పార్టీ ప్రతిష్టను పెంచే, స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సమాయత్తం కావాలని, జిల్లా బిజెపి అధ్యక్షురాలు, అయినంపూడి శ్రీదేవి పిలుపునిచ్చారు. స్థానిక ఎలక్ట్రీషియన్స్ సంఘం భవనంలో గురువారం పట్టణ అధ్యక్షులు కొల్లికొండ ప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రత్యేక హోటల్లో సమగ్ర సవరణ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్క ఓటు నమోదయ్యాలా శ్రద్ధ వహించాలని కోరారు. కార్యకర్తలు తమకు పార్టీ బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర బిజెపి నాయకులు ఉన్నమట్ల కబర్ది, రైల్వే బోర్డు సభ్యులు జక్కంపూడి కుమార్, అల్లూరి పద్మ వర్మ తదితరులు పాల్గొన్నారు.