Skip to main content

Telugu News Power

వైద్య విద్యార్థులకు ఉపకారవేతనాల ఒప్పందం. -మంత్రి ఎస్. కే . యాదవ్.

అమరావతి:ఆగష్టు,6(తెలుగు న్యూస్ పవర్. కామ్)
రాష్ట్ర సచివాలయంలో ఫీనిక్స్ ఫౌండేషన్, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మధ్య అవగాహన ఒప్పందం (ఎం ఓ యూ) కుదిరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామాత్యులు సత్యకుమార్ యాదవ్ గురువారం వెల్లడించారు.ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన ఎంబీబీఎస్ విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రోత్సాహం అందించడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని వివరించారు.దీని ద్వారా వార్షిక కుటుంబ ఆదాయం రూ.5 లక్షలకు మించని ప్రతిభావంతులైన ఎంబీబీఎస్ విద్యార్థులకు ప్రతి విద్యా సంవత్సరంలో 10 మెడికల్ స్కాలర్‌షిప్‌లు అందుతాయి.
ఆర్థిక ఇబ్బందులు, ప్రతిభకు అడ్డు కారాదనే ఉదాత్త లక్ష్యంతో ప్రభుత్వం, విద్యా సంస్థలు, సేవా సంస్థల భాగస్వామ్యం క్షల్పిస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్య రంగానికి నైపుణ్యంతో కూడిన వైద్యులను అందించడంలో ఈ ఒప్పదం కీలక పాత్ర పోషించనుందని మంత్రి పేర్కొన్నారు.