పాలకొల్లు: ఆగస్టు,7( తెలుగు న్యూ స్ పవర్. కామ్) స్థానిక
వివర్స్ కాలనీలో ఉన్న సంఘ భవనంలో జాతీయ చేనేత దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ .సందర్భంగా ఏర్పాటుచేసిన చేనేత వస్త్రాల అమ్మకం దుకాణాల సముదాయం నరసాపురం ఆర్డీవో దాసిరాజు, శుక్రవారం
ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంస్కృతి సాంప్రదాయాలకు చేనేత వస్త్రాలు ప్రతీకగా నిలుస్తాయన్నారు. చేనేత వస్త్రాలు ధరించడం ద్వారా మనవరానికి తగినట్టుగా, సౌఖ్యంగా ఉంటుందన్నారు. ఉష్ణోగ్రతలు శరీరానికి చల్లదనం కలిగిస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చేనేత కార్మికులకు విద్యుత్ ఏడాదికి రూ. 25 వేల ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేనేత వస్త్రాల అమ్మకాలకు ప్రతినిధిగా, ప్రజలకు ఉద్యోగులకు చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారన్నారు. ప్రతి శుభకార్యానికి, పండుగలకు తప్పనిసరిగా కొంతైనా చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేవలం చేనేత వృత్తిపై మాత్రమే జీవించగలిగే వారి ఉపాధికి కొంత ఊరట లభిస్తుందన్నారు. వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్, వ్యాపారవేత్త, వట్టం గణేశ్వర రావు (గణేష్ ),కార్యదర్శి నేలంశెట్టి ప్రసాద్, కోశాధికారి, పెద్ద గోపురం ధర్మకర్త బాసిన ఏ.ఎన్ సత్యనారాయణ ల ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం నియోజకవర్గ నలుమూలల నుంచి విచ్చేసిన చేనేత వృత్తి కళాకారుల సోదరి సోదరీమణులతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
బిజెపి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్నమట్ల కపర్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.