Skip to main content

Telugu News Power

ఎల్ నినో వాతావరణ ప్రభావం పై రైతులకు అవగాహన కార్యక్రమం.

పాలకొల్లు: ఆగస్టు,7( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
తిల్లపూడి గ్రామం లో శుక్రవారం పాక్స్ సొసైటీ వద్ద ఎల్ నీనో ప్రభావం వల్ల వరి పంట ఫై జరిగే మార్పులు మీద రైతులకు అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిది జే డి ఏ , జడ్ .వెంకటేశ్వరావు మాట్లాడుతూ, రైతులు నత్రజని ఎరువులు ఎక్కువగా భూమిలో వేయడం ద్వారా వెలువడే ఉద్గార వాయువులు, వరి పంట పండించడం వలన వచ్చే మీథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్ వాయువుల వల్ల వాతావరణం లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపారు. వరి పంట కోత అనంతరం గడ్డిని కాల్చడం వలన కార్బన్ డైయాక్సైడ్ గాల్లో కలుస్తుందని తెలిపారు. మార్టేరు శాస్త్రవేత్త సహదేవ రెడ్డి మాట్లాడుతూ, వరి పంట లో నీరు ఆరబెట్టడం వల్ల కార్బన్ ఉధ్గారాలు అనగా, మీథేన్ గ్యాస్ తగ్గుతుందని తెలిపారు. శాస్త్రవేత్త దయాల్ మాట్లాడుతూ, తక్కువ కాలపరిమిత వంగడాలను వేసుకోవాలని సూచించారు. శాస్త్రవేత్త కృష్ణాజి మాట్లాడుతూ, వరి పంటలో సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి వివరించారు. ఏ డి ఏ పి మురళీకృష్ణ మాట్లాడుతూ కాంప్లెక్స్ ఎరువులను దమ్ములో మాత్రమే వేసుకోవాలని సూచించారు. పంటల భీమా గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో నీటి సంఘం ప్రెసిడెంట్ ఇంటి శ్రీరాములు, తిల్ల పూడి సొసైటీ ప్రెసిడెంట్ రంగారావు, ఏఎంసీ డైరెక్టర్ నీలం తాతాజీ, కలిదిండి రామచంద్ర రాజు, ఏవో రాజశేఖర్, రైతులు పాల్గొన్నారు.