పాలకొల్లు: ఆగస్టు, 8( తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.48 వేలు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా అందజేస్తుందని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. నియోజకవర్గంలో రూ.1.95 కోట్ల నిధులతో ప్రారంభించనున్న అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, రామానాయుడు శనివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వెలివిలి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిమెంటు రోడ్డు, డ్రైన్ పనులకుశంకుస్థాపన అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ, వృద్ధులు వికలాంగులకు ఏ విధమైన పెట్టుబడి, కష్టనష్టాలు లేకుండా 5 ఎకరాల ఆదాయాన్ని పింఛన్ ద్వారా అందజేస్తుందని తెలిపారు. దివ్యాంగులకు ఏడాదికి రూ.75 వేల పింఛన్ అందజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో, మండల అభివృద్ధి అధికారి, ఉమామహేశ్వరరావు, వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, ఏ ఈ శ్రీనివాస్, టిడిపి మండల అధ్యక్షులు పాముల రజిని కుమార్, బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్తి, బోడపాటి వెంకటనారాయణ, కలిదిండి రామచంద్ర రాజు, డాక్టర్ శివ, కొప్పినీడి శ్రీనివాస్, కోటి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు మంత్రికి అపూర్వ స్వాగతం పలికారు.
5 ఎకరాల ఆదాయం, పింఛను దారులకు కూటమి ప్రభుత్వ వరం. -మంత్రి నిమ్మల