పాలకొల్లు: ఆగస్టు,8( తెలుగు న్యూస్ పవర్. కామ్) జగన్ పాదయాత్రలో, డీఎస్సీ,మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని, ఒక్క పోస్ట్ కూడా వేయకుండా మాట తప్పి, మడం తిప్పి, నిరుద్యోగులను మోసం చేసినందుకు ముందుగా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, నూటికితే ప్రజలు కొంతైనా క్షమిస్తారని మంత్రి నిమ్మల డిమాండ్ చేశారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, వైసిపి పార్టీ డీఎస్సీ పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో డీఎస్సీ ద్వారా ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయకుండా నిరుద్యోల ఆశలపై నీళ్లు చల్లారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎగాట్ చేసి లో 16 వేల పైగా పోస్టులు భర్తీ చేసిందని గుర్తు చేశారు. నిరుద్యోగు లు చకోర పక్షుల్లా 7- 8 ఏళ్లు ఎదురు చూసారని, ఎన్నో వ్యయప్రయాశలకు ఓర్చి తమ ప్రతిభ తో ఉద్యోగం సంపాదించు కుంటే, లేనిపోని సమస్యలు సృష్టించి, వైసిపి పార్టీ చేస్తున్న విన్యాసాలను ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకోవాలన్నారు. అసలు డి ఎస్ సి అవసరమే లేదన్నట్టు, వైసిపి పార్టీ నా డీఎస్సీ నోటిఫికేషన్ దగ్గర నుంచి కోర్టుల్లో 335 కేసులు వేసింది అని వెల్లడించారు. ఇప్పుడు నిరుద్యోగుల కోసమని, రోడ్డెక్కటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. డీఎస్సీ అంటే చంద్రబాబు నాయుడని, రెండు లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కి లేదన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ముందుకు వెళుతుందన్నారు. రెండేళ్లలో ప్రజల్లో ప్రభుత్వం పట్ల సంతృప్తికర స్థాయికి పాలన కొనసాగుతుందని తెలిపారు. ఇందువల్ల, వైసిపి పార్టీ ఇప్పుడున్న 11 సీట్లు కూడా రావేమోననే ఆందోళనలో ఇలాంటి నిరసనలు చేస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజలు పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు ఉన్న మట్ల కపర్తి, టిడిపి మండల అధ్యక్షులు పాముల రజినీ కుమార్ తదితరులు పాల్గొన్నారు
వైసిపి పార్టీకి జగన్ రాజీనామా చేసి రోడ్డెక్కాలి. -మంత్రి నిమ్మల డిమాండ్