పాలకొల్లు: ఆగస్టు, 8( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఆదేశాలతో
పాలకొల్లు నియోజకవర్గం లో గత మూడు రోజులుగా పాలకొల్లు పట్టణం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగుచున్న రిలే నిరాహార దీక్షలు విజయవంతం అయ్యాయని పట్టణ అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్ శనివారం తెలిపారు.
డీఎస్ స్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, విద్యా దీవెన,వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, రిలే నిరాహార దీక్షలు విజయవంతం చేసిన
పాలకొల్లు నియోజకవర్గ వైస్సార్సీపీ, మండల, పట్టణ అధ్యక్షులుకు, ఎంపీపీ లకు, జడ్పీటీసీ లకు, ఎంపీటీసీ లకు, మాజీ సర్పంచ్ లకు,గ్రామ, వార్డు అధ్యక్షులుకు ,వివిధ అనుభంద విభాగాల అధ్యక్షులు కి, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు కి, మహిళా విభాగం నాయకులు కి, మీడియా, సోషల్ మీడియా అధ్యక్షులు కి, కార్యకర్తలు కి, అభిమానులుకు పాలకొల్లు వైస్సార్సీపీ ఇంచార్జి గుడాల శ్రీహరి గోపాలరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో, వైసీపీ రాష్ట్ర నాయకులు ఎడ్ల తాతాజీ, మండల వైసిపి అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ దీక్షలు విజయవంతం. -ఇంచార్జ్ గుడాల గోపి