Skip to main content

Telugu News Power

క్షీరా రామంలో కళస పూజ.

లీలా కళ్యాణ మండపం లో కళస పూజ.

పాలకొల్లు: ఆగస్టు,9( తెలుగు న్యూస్ పవర్. కామ్)
పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో గత నెల 31 నుంచి జరుగుతున్న జలాభిషేకం పూజలు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి పూజ, రక్షాబంధన పూజ,సర్వత భద్రతా మండపారాధన, కలసస్థాపన (108 కలశములతో) మహన్యాసం పూజలు, రుద్రాభిషేకములు మొదలగు పూజలు నిర్వహించారు. అభిషేక పండితులు భమిడిపాటి వెంకన్న,మద్దూరు సూరిబాబు, సుబ్బయ్య, ఆలయ ప్రధాన అర్చకులు అనిల్, కిష్టప్ప, వీరబాబు, సోమేశ్వరావు, అర్చకులు, పూజలు జరిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు ఆలయ ధర్మకర్తలు బాసిన సత్యనారాయణ, హోత ప్రవళ, సూపరింటెండెంట్ వాసు,దాతలు, శ్రీ స్వామివారి భక్తులు పాల్గొన్నరు.