Skip to main content

Telugu News Power

టీటీడీ జేఈవోగా ప్రభల గోపీనాధ్ కు బాధ్యతలు.

తిరుమల: ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక కేంద్రం, తిరుమల తిరుపతి దేవస్థానం
నూతన జేఈవో (వైద్యం మరియు విద్య)గా నియమితులైన ప్రభల గోపీనాథ్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.అనంతరం తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో, లోకనాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి, ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన జారీ చేసారు.