Skip to main content

Telugu News Power

శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి 108 కలశములతో జలాభిషేకం.

పాలకొల్లు: ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్)పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము లో శ్రీ స్వామివారికి జలాభిషేకం సందర్భంగా సోమవారం, ఉదయం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి పూజ, శ్రీ స్వామివారికి 108 కలశములతో అభిషేకం ఏకాదశ రుద్రములతో అభిషేక పండితులు, బ్రాహ్మణులుచే స్వస్తి మంత్రాలతో స్వామివారి 108 కలశములు పూజలు, రుత్వికులతో రుద్ర పారాయానణం చేయుట, వన పూజ దేవతలను ఆరాధన చేయుట మొదలగు పూజా కార్యక్రమము జరిగిగాయి. క్షీరా రామలింగేశ్వర స్వామి వారికి భక్తులు దాతలు శ్రీ స్వామివారి కలశములను బ్రాహ్మణులకు అందజేసారు. శ్రీ స్వామివారికి జలాభిషేకం జరిగింది. శ్రీ స్వామివారికి జలాభిషేకం చేయుటకు 108 కలశములతో భక్తులు సుమారుగా 350 మంది మెయిన్ కాలువ దగ్గరకు ఊరేగింపుగా వెళ్లి కలశముల నిండా నీళ్లు పట్టి తిరిగి శ్రీ స్వామివారి దేవాలయమునకు వచ్చి స్వామివారికి జల అభిషేకములు చేయుట జరిగింది. ఈ పూజా కార్యక్రమాలు అభిషేక పండిట్ బమ్మిడిపాటి వెంకన్న మద్దూరు సూరిబాబు ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప అనిల్ వీరబాబు, సుమారు 25 మంది రుత్వికులు తో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ, అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపరింటెండెంట్ వాసు,ఆలయ ధర్మకర్తలు ఉప్పలపు దుర్గ పెద్దిరాజు, హోత ప్రవాలా, నాలామ్ నాగ వెంకట సురేఖ, పినిశెట్టి శ్రీనివాసు,కొండ్రెడ్డి సూర్యనారాయణ, పెన్మెచ్ శ్రీదేవి, బాసిన అప్పల నాగ సత్యనారాయణ, వందరపు శ్రీనివాసు నీ లాపు సింహాచలం,నీలాపుమని, రంగయ్య నాయుడు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఆలయ మాడవీధులలో సాయంత్రం సప్త ప్రదక్షణల కార్యక్రమంలో సుమారు 400 మంది భక్తులు పాల్గొన్నారు. రాత్రి పంచ హారతులు, ధూప సేవ స్వామి వారికి నిర్వహించారు

 

ఆలయ మాఢవీధుల్లో ప్రదక్షిణలు చేస్తున్న భక్తులు