పాలకొల్లు: ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ పై సిబిఐ విచారణ కోరుతూ, గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. ఈ దీక్షలు విజయవంతం కావడంతో సోమవారం పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి గుడాల గోపి ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ తలపెట్టారు. ఈ సందర్భంగా ఎలమంచిలి మండల వైసీపీ పార్టీ అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు మాట్లాడుతూ, శాంతియుతంగా తాము నిరసన తెలియజేస్తుంటే పోలీసులు అడ్డంకులు కల్పిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో హాజరైన వైసీపీ శ్రేణులు మెగా డీఎస్సీ దగాడిఎస్సి అని నినాదాలు చేశారు. డీఎస్సీ లోపాలకు బాధ్యత వహించి విద్యామంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ నిరుద్యోగ భృతి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి మండల ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి రవికుమార్, పట్టణ అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్, మంచిలి మండల అధ్యక్షులు కుచ్చుల స్టాలిన్ బాబు, రాష్ట్ర వైసీపీ నాయకులు మేక శేషుబాబు, ఎడ్ల తాతాజీ చిలువూరు కుమార దత్తాత్రేయ వర్మ, చెల్లెం ఆనంద ప్రకాష్, మద్దా చంద్రకళ, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ చైర్మన్లు, పార్టీ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
వైసిపి పార్టీ నిరసన ర్యాలీ.
వైసిపి పార్టీ నిరసన ర్యాలీ