Skip to main content

Telugu News Power

క్రీడల్లోనూ రాణిస్తే విద్యలోనూ అగ్రస్థానంలో నిలుస్తారు.

క్రీడ ప్రారంభోత్సవ సభలో ఎమ్మెల్యే అంజిబాబు, కలెక్టర్ నాగరాణి.

అమరావతి ఛాంపియన్షిప్ జిల్లాస్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు.

భీమవరం : ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్)విద్యార్థులు క్రీడల్లో బాగా రాణిస్తే మంచి శరీర దారుఢ్యంతో, విద్యలోనూ అగ్రస్థానంలో నిలుస్తారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పేర్కొన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని వాటిని క్రీడాకారుల సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, క్రీడాకారులు జిల్లాస్థాయిలో ప్రతిభ కనపర్చడమే కాకుండా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని జిల్లాకు మంచి పేరు ప్రత్యేకతలు తీసుకురావాలన్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీ డి విశ్వనాథ్ మాట్లాడుతూ, క్రీడాకారులు మత్తు పదార్థాలకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడ ప్రతిభను చాటాలని కోరారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ పి రవీంద్రనాథ్, జిల్లా క్రీడల డెవలప్మెంట్ ఆఫీసర్ నూతక్కి మోహన్ దాస్, మాట్లాడుతూ క్రీడా పోటీల్లో జిల్లాలో ఏడు నియోజక వర్గాలకు సంబంధించి వాలీబాల్లొ 190, మంది వెయిట్ లిఫ్టింగ్ లో ఏడు మంది, చెస్ లో 41 మంది, బ్యాడ్మింటన్ లో 56 మంది, యోగాల్లో 63 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. కళాశాల సెక్రటరీ సాగి రామకృష్ణ నిషాంత వర్మ, ప్రిన్సిపల్ డా కెవి మురళీకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి, సిహెచ్ హరిమోహన్, డా పి సత్యనారాయణరాజు , జి సారిక, వి అవినాష్, జి లోహిత తదితరులు పాల్గొన్నారు.